రిక్షా తొక్కి, మెడలో కూరగాయల దండతో.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న గ్యాస్, చమురు ధరలు, నిత్యావసరాల ధరలకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాలు సునీతా ముదిరాజ్ గాంధీ భవన్ వద్ద వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రిక్షా తొక్కుతూ పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసన తెలిపి.. మెడలో కూరగాయల దండను ధరించి పెరిగిన నిత్యవసరాల ధరల పరిస్థితిపై రోడ్డుపై ధర్నా చేశారు. పెరుగుతున్న ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమంటూ ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. […]
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న గ్యాస్, చమురు ధరలు, నిత్యావసరాల ధరలకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాలు సునీతా ముదిరాజ్ గాంధీ భవన్ వద్ద వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
రిక్షా తొక్కుతూ పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసన తెలిపి.. మెడలో కూరగాయల దండను ధరించి పెరిగిన నిత్యవసరాల ధరల పరిస్థితిపై రోడ్డుపై ధర్నా చేశారు. పెరుగుతున్న ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమంటూ ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. రోడ్డుపై ధర్నా చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.