కూతురిని పంపు.. కేసు తేల్చేస్తా !

దిశ, వెబ్ డెస్క్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న కారణంతో ఎస్సై ఓ ఇంటిపై రైడ్ చేశాడు. ఆ తర్వాత కేసు మాఫీ కోసం ఆ కుటుంబంలోని ఆడబిడ్డను ఇంటికి పంపమన్నాడు. ఎస్సై ఫోన్ సంభాషణను ఉన్నతాధికారులు పరిశీలించి ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ దారుణం సోమవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తుంగపేటకు చెందిన అన్నెపు అప్పారావు ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రామకృష్ణ సిబ్బందితో దాడి చేశాడు. 48 మద్యం బాటిళ్లు […]

Update: 2020-08-24 01:48 GMT

దిశ, వెబ్ డెస్క్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న కారణంతో ఎస్సై ఓ ఇంటిపై రైడ్ చేశాడు. ఆ తర్వాత కేసు మాఫీ కోసం ఆ కుటుంబంలోని ఆడబిడ్డను ఇంటికి పంపమన్నాడు. ఎస్సై ఫోన్ సంభాషణను ఉన్నతాధికారులు పరిశీలించి ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ దారుణం సోమవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో చోటుచేసుకుంది.

మండలంలోని తుంగపేటకు చెందిన అన్నెపు అప్పారావు ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రామకృష్ణ సిబ్బందితో దాడి చేశాడు. 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయలేదు. అప్పారావు కుమార్తె తన ఇంటికి వస్తే కేసు గురించి ఆలోచిస్తామని ఎస్సై చెప్పినట్టు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సైని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

Tags:    

Similar News