‘రేపిస్ట్‌ను ప్రశ్నిస్తే దాడి చేశారు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో పోటీకి రేప్ కేసు నిందితుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రశ్నించిన ఓ మహిళా సభ్యురాలిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యురాలు తారా యాదవ్‌ను వేదికపై దాడి చేసి కిందకు నెట్టేసినట్టు వీడియోలో రికార్డ్ అయింది. రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికల్లో రేపిస్టు ముకుంద్ భాస్కర్‌కు టికెట్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని తాను ప్రశ్నించారని, దీంతో […]
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో పోటీకి రేప్ కేసు నిందితుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రశ్నించిన ఓ మహిళా సభ్యురాలిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యురాలు తారా యాదవ్‌ను వేదికపై దాడి చేసి కిందకు నెట్టేసినట్టు వీడియోలో రికార్డ్ అయింది. రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికల్లో రేపిస్టు ముకుంద్ భాస్కర్‌కు టికెట్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని తాను ప్రశ్నించారని, దీంతో కాంగ్రెస్ వర్కర్లు తనపై దాడి చేశారని తారా యాదవ్ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీని అభ్యర్థించారు. డియోరా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ నేత ముకుంద్ భాస్కర్ మణి త్రిపాఠికి పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలోని ఏడు స్థానాల్లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.