ఇంట్లో ఉన్న మహిళ.. అగ్నికి ఆహుతి

దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదానికి ఓ మహిళ ఆహుతి అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాకర్ల వీధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గురువారం ఇంట్లోనే ఒంటరిగా ఉన్న రామలక్ష్మీ అనే మహిళ వంట చేసేందుకు గ్యాస్ ముట్టించింది. ఈ తరుణంలో ఒక్కసారిగా గ్యాస్ సిలీండర్ పేలడంతో మంటలు వ్యాప్తించాయి. మంటల ధాటికి రామలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో హుటాహుటిన పరిగొత్తుకొచ్చిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ జరగాల్సిన విషాదం […]

Update: 2020-08-13 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదానికి ఓ మహిళ ఆహుతి అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాకర్ల వీధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గురువారం ఇంట్లోనే ఒంటరిగా ఉన్న రామలక్ష్మీ అనే మహిళ వంట చేసేందుకు గ్యాస్ ముట్టించింది. ఈ తరుణంలో ఒక్కసారిగా గ్యాస్ సిలీండర్ పేలడంతో మంటలు వ్యాప్తించాయి. మంటల ధాటికి రామలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో హుటాహుటిన పరిగొత్తుకొచ్చిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ జరగాల్సిన విషాదం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News