వైద్యం కోసం వాగు దాటించి…

దిశ, మణుగూరు: కుండపోతగా కురిసిన వర్షానికి మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిత్యావసరాలు, వైద్యం కోసం గిరిజనులు వాగులు దాటక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. గుండాల-నరసాపురం మధ్య మల్లన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో నరసాపురం తండాకు చెందిన మాలోతు మౌనిక తన 45 రోజుల పాపకు టీకా వేయించేందుకు, స్థానికుల సాయంతో వాగు దాటి టీకా వేయించింది. ప్రమాదమని తెలిసినా.. అత్యవసర […]

Update: 2020-10-15 10:03 GMT

దిశ, మణుగూరు: కుండపోతగా కురిసిన వర్షానికి మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిత్యావసరాలు, వైద్యం కోసం గిరిజనులు వాగులు దాటక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. గుండాల-నరసాపురం మధ్య మల్లన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

దీంతో నరసాపురం తండాకు చెందిన మాలోతు మౌనిక తన 45 రోజుల పాపకు టీకా వేయించేందుకు, స్థానికుల సాయంతో వాగు దాటి టీకా వేయించింది. ప్రమాదమని తెలిసినా.. అత్యవసర పరిస్థితులలో వాగు దాటడం తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మా బతుకులు ఎప్పుడు మారతాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Tags:    

Similar News