ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునగాల మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన మోదాల నాగమణి(30) కుటుంబ కలహాలతో, ఇంట్లో అందరూ పడుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతురాలికి ఇద్దరు […]

Update: 2020-10-05 21:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునగాల మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన మోదాల నాగమణి(30) కుటుంబ కలహాలతో, ఇంట్లో అందరూ పడుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News