ఆత్మహత్య చేసుకున్న మహిళ.. కారణం అదేనా..??
దిశ, ఎల్బీనగర్: వివాహిత ఆత్మహత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగడంతో ఎల్బీనగర్ పీఎస్ ముందు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్బీనగర్ లో నివాసముండే అమూల్య (22) అనే యువతి గురువారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త డేవిడ్ కారణమని.. మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ […]
దిశ, ఎల్బీనగర్: వివాహిత ఆత్మహత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగడంతో ఎల్బీనగర్ పీఎస్ ముందు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్బీనగర్ లో నివాసముండే అమూల్య (22) అనే యువతి గురువారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త డేవిడ్ కారణమని.. మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి. పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.