హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చాలా రోజులుగా తన కేసు పెండింగ్‎లో ఉండడం, తీర్పు రాకపోవడంతో నిరాశ చెందిన మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందదుకు యత్నించింది. అయితే అది గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చొబెట్టి ఆమె కేసు, ఇతర వివరాలు సేకరించారు. గోదావరిఖనికి చెందిన కవిత మీద ఏప్రిల్ 11న మురళీ అనే […]

Update: 2020-10-06 07:11 GMT

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చాలా రోజులుగా తన కేసు పెండింగ్‎లో ఉండడం, తీర్పు రాకపోవడంతో నిరాశ చెందిన మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందదుకు యత్నించింది. అయితే అది గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చొబెట్టి ఆమె కేసు, ఇతర వివరాలు సేకరించారు.

గోదావరిఖనికి చెందిన కవిత మీద ఏప్రిల్ 11న మురళీ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. అయితే ఆరు నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా తనకు తీర్పు రావడం లేదంటూ నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కవిత పేర్కొంది.

Tags:    

Similar News