ఇంటర్వెల్ మాత్రమే..శుభం కార్డుకు టైం ఉంది: మంత్రి పెద్దిరెడ్డి 

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. శుభం కార్డుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానన్నారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. మహాపాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర […]

Update: 2021-11-22 02:38 GMT
peddireddy
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. శుభం కార్డుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానన్నారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. మహాపాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని..అలా అనుకుంటే అది వారి భ్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.

epaper – 1:30 PM AP EDITION (22-11-21) చదవండి

Tags:    

Similar News