వలస కూలీలపై పెట్టిన కేసులు ఎత్తివేయండి: సుప్రీంకోర్టు
దిశ, వెబ్ డెస్క్: వలస కూలీలపై లాక్ డౌన్ ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వలస కూలీలను తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వలస కూలీలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.