పుట్టిన రోజు, పెళ్లి రోజులకు పోస్టల్ స్టాంప్‌లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి రోజు, పుట్టిన రోజు లాంటి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. వాటిని మెమొరబుల్‌గా ఉంచుకోవడానికి లేదా తమకు నచ్చిన వారి ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా చేయడానికి బహుమతులు ఇస్తుంటారు. ఆ బహుమతులు ఎప్పటికప్పుడు వెరైటీగా ఉండేలా చూసుకుని, ఎదుటివారి మెప్పు పొందుతుంటారు. ఆ క్రమంలోనే వ్యక్తిగతీకరించిన కాఫీ మగ్‌లు, విజిటింగ్ కార్డులు, కీచైన్‌లు, ఫొటోలు ఇలా చాలా రకాల బహుమతుల ఎంపికలు ఉన్నాయి. అలాంటి బహుమతుల ఎంపికను […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి రోజు, పుట్టిన రోజు లాంటి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. వాటిని మెమొరబుల్‌గా ఉంచుకోవడానికి లేదా తమకు నచ్చిన వారి ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా చేయడానికి బహుమతులు ఇస్తుంటారు. ఆ బహుమతులు ఎప్పటికప్పుడు వెరైటీగా ఉండేలా చూసుకుని, ఎదుటివారి మెప్పు పొందుతుంటారు. ఆ క్రమంలోనే వ్యక్తిగతీకరించిన కాఫీ మగ్‌లు, విజిటింగ్ కార్డులు, కీచైన్‌లు, ఫొటోలు ఇలా చాలా రకాల బహుమతుల ఎంపికలు ఉన్నాయి. అలాంటి బహుమతుల ఎంపికను మరింత ప్రత్యేకం చేయడానికి మీరట్ పోస్ట్ ఆఫీస్ అధికారులు ఒక వినూత్న పథకానికి తెరదించారు. ‘మై స్టాంప్’ పేరుతో పుట్టిన రోజు, పెళ్లి రోజులు, వార్షికోత్సవాలకు పోస్టల్ స్టాంప్‌ను ప్రచురించనున్నట్లు తెలిపారు.
రూ.300 చెల్లించి వారికి ఇష్టమైన వారి ఫొటోతో పాటు హ్యాపీ బర్త్‌డే, యానివర్సరీ మెసేజ్‌లతో 12 పోస్టల్ స్టాంప్‌లను ప్రింట్ చేయించుకోవచ్చని డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ ఎన్‌కే అగర్వాల్ తెలిపారు. మీరట్ కంటోన్మెంట్ ప్రధాన పోస్టాఫీస్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ పోస్టల్ స్టాంప్‌లను దేశవ్యాప్తంగా ఎక్కడైన ఉపయోగించవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవి చెల్లుతాయని ఆయన హామీ ఇచ్చారు. పోస్టల్ సర్వీస్ వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.