త్రైమాసిక ఫలితాల్లో తగ్గిన విప్రో లాభాలు!

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే, విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 2,326 కోట్లతో 6.3 శాతం తగ్గింది. ఆదాయం విషయంలో రూ. 15,711 కోట్లను ఆర్జించినట్లు సంస్థ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 15,006 కోట్లు ఉండగా, ఈసారి 4.48 శాతం పెరిగింది. […]

Update: 2020-04-15 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే, విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 2,326 కోట్లతో 6.3 శాతం తగ్గింది. ఆదాయం విషయంలో రూ. 15,711 కోట్లను ఆర్జించినట్లు సంస్థ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 15,006 కోట్లు ఉండగా, ఈసారి 4.48 శాతం పెరిగింది. ఐటీ సర్వీసుల్లో ఆపరేటింగ్ మార్జిన్ స్వల్పంగా 0.8 శాతం తగ్గి 17.6 శాతంగా ఉందని సంస్థ పేర్కొంది. ఇక కొవిడ్-19 వల్ల తమ కార్యకలాపాలకు ఎంత వరకూ నష్టాలు ఉంటాయో ఇంకా స్పష్టత రాలేదని సంస్థ తెలిపింది. డిమాండ్, సరఫరాలపై ఖచ్చితత్వాన్ని వచ్చిన తర్వాతే రెవెన్యూ గైడెన్స్ ఇస్తామని సంస్థ స్పష్టం చేసింది. జూన్ 30 వరకూ రెవెన్యూ గైడెన్స్‌ను వాయిదా వేయడానికి నిర్ణయించినట్టు సంస్థ వెల్లడించింది.

Tags: Wipro, Q4 results,Wipro, IT sector, coronavirus,Q4 Earn

Tags:    

Similar News