వైన్‌ షాపులో నిల్లు.. బెల్టు షాపులో ఫుల్లు

దిశ, ఇల్లందు: ఇల్లందులో మద్యం మాఫియా మూడు ఫుల్లులు ఆరు హాఫులుగా సాగుతున్నది. వైన్స్ నిర్వాహకులు సిండికేట్‌గా మారి ఖరీదైన మద్యాన్ని వైన్స్‌షాపుల్లో ఉంచడం లేదు. దొంగచాటున బెల్టుషాపులకు అమ్ముతూ అక్రమ దందాకు తెరలేపారు. ఫలితంగా మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నది. ఇల్లందులో మద్యం మాఫియా రెచ్చిపోతున్నది. మద్యం నిర్వహకులంతా కలిసి సిడెకేట్‌గా మారారు. మద్యం దుకాణాల్లో ఉంచాల్సిన పలు బ్రాండ్లను గుట్టుగా బెల్టుషాపులకు అమ్ముతున్నారు. ఫలితంగా బెల్ట్ షాపుల్లో దొరకాల్సిన చీప్ లిక్కర్ వైన్‌షాప్‌లో దొరకుతున్నాయి. […]

Update: 2020-10-12 02:08 GMT
వైన్‌ షాపులో నిల్లు.. బెల్టు షాపులో ఫుల్లు
  • whatsapp icon

దిశ, ఇల్లందు: ఇల్లందులో మద్యం మాఫియా మూడు ఫుల్లులు ఆరు హాఫులుగా సాగుతున్నది. వైన్స్ నిర్వాహకులు సిండికేట్‌గా మారి ఖరీదైన మద్యాన్ని వైన్స్‌షాపుల్లో ఉంచడం లేదు. దొంగచాటున బెల్టుషాపులకు అమ్ముతూ అక్రమ దందాకు తెరలేపారు. ఫలితంగా మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నది.

ఇల్లందులో మద్యం మాఫియా రెచ్చిపోతున్నది. మద్యం నిర్వహకులంతా కలిసి సిడెకేట్‌గా మారారు. మద్యం దుకాణాల్లో ఉంచాల్సిన పలు బ్రాండ్లను గుట్టుగా బెల్టుషాపులకు అమ్ముతున్నారు. ఫలితంగా బెల్ట్ షాపుల్లో దొరకాల్సిన చీప్ లిక్కర్ వైన్‌షాప్‌లో దొరకుతున్నాయి. వైన్‌షాపు నిర్వాహకుల తీరుతో మందుబాబుల జేబులకు చిల్లు పడుతున్నది.

ఇల్లందు పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు ఉన్నాయి. వేర్వేరు టెండర్ల ద్వారా పర్మిట్లు దక్కించుకున్నారు. వీరంతా చేయి కలిపి ఒక సిండికేట్ ఆఫీసును ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడి నుంచి మద్యాన్ని బెల్టు షాపులకు చేరవేస్తున్నారు. బెల్టుషాపులకు క్వాటర్ మందు రూ.20, బీర్లకు రూ.20 అదనంగా అమ్ముతున్నారు. ఖరీదైన మద్యం అయితే రూ.40 వరకు ముక్కుపిండి లాగుతున్నారు. బెల్ట్‌షాప్ వారు మందుబాబుల దగ్గర క్వార్టర్‌కి రూ.40, బీర్‌కి రూ.30, ఖరీదైన మద్యం అయితే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు.

ప్రతి వీధికీ బెల్టుషాపులు…

ఇల్లందుల పట్టణంలోని ప్రతి వీధిలో బెల్ట్ షాపులు బార్లా తెరిచి ఉన్నారు. ప్రతి వార్డులో మూడు, నాలుగు బెల్టు‌షాపులు దర్శనమిస్తున్నాయి. బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యాన్ని నేరుగా కౌంటర్ల ముందు విక్రయిస్తున్నారు. అటుగా వచ్చి పోయే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి యువత కౌంటర్ల ముందే తాగడంతో వృద్ధులు, మహిళలు అసహనానికి గురవుతున్నారు.

‘బెల్టు’తీసేదెవరు?

బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా మందు విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. బెల్టు షాపులపై పోలీసు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సినా పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలకు తావునిస్తున్నది. కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు శాఖలకు ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి మద్యం దందాకు తెరదించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News