ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : దత్తత గ్రామాల్లో సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చిన తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దత్తత గ్రామాల్లో ఏం చేశారని రేవంత్​రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇంటింటికీ నల్లా ఇవ్వలేదని, ఇండ్లు లేవని, తాగు, సాగునీరు అందించలేదని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, పింఛన్లు ఇవ్వలేదని, లక్ష రూపాయల రుణమాఫీ లేదని అన్నారు. దత్తత గ్రామాల్లో అభివృద్ధిపై అంబేద్కర్​విగ్రహం ఎదుట కూర్చుందామని, కులానికి ఒక్కరిని […]

Update: 2021-08-24 06:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దత్తత గ్రామాల్లో సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చిన తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దత్తత గ్రామాల్లో ఏం చేశారని రేవంత్​రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇంటింటికీ నల్లా ఇవ్వలేదని, ఇండ్లు లేవని, తాగు, సాగునీరు అందించలేదని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, పింఛన్లు ఇవ్వలేదని, లక్ష రూపాయల రుణమాఫీ లేదని అన్నారు. దత్తత గ్రామాల్లో అభివృద్ధిపై అంబేద్కర్​విగ్రహం ఎదుట కూర్చుందామని, కులానికి ఒక్కరిని పిలిచి పంచాయతీ పెడుతామని సీఎంకు సవాల్​ విసిరారు. తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా దోపిడీ చేశారని ఆరోపించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో సమస్యలను తీర్చినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.

గజ్వేల్​ ఫాంహౌస్​లో బంధీ

సీఎం కేసీఆర్​ మీడియా దృష్టిని మళ్లించడంతో పాటుగా తన ప్రశ్నలు ప్రజలకు తెలియకుండా చేసేందుకు ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్​మీటింగ్​పెట్టాడని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. “ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల… నా తల్లి బంధీ అయిందో కనిపించని కుట్రల..” ఆనాడో ఏమైందో కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో కన్నీరు పెడుతున్నారని, కనిపించని కుట్రలతో తెలంగాణ తల్లి బంధీ అయిందని, గజ్వేల్‌లోని కేసీఆర్​ ఫాంహౌస్‌లో బంధీ చేశారని రేవంత్​రెడ్డి విమర్శించారు.

గ్రామాల్లో పనుల కోసం సర్పంచ్‌లు అప్పులు తెచ్చి పనులు చేశారని, వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రెండు రోజుల కిందట నారాయపేటలో సర్పంచ్​అనిత ఆత్మాహత్యాయత్నం చేసుకుని, బయటపడి ఇప్పుడు కూలీ పని చేసుకుంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఓ సర్పంచ్​వాచ్​మెన్‌గా పని చేస్తున్నాడన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బానిసలుగా బతుకుతున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News