ప్రభాస్@22 పౌరాణిక చిత్రమా?

‘బాహుబ‌లి’ సినిమాతో అసాధార‌ణ మాస్ ఇమేజ్‌ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. ఆయ‌న స్టార్‌డ‌మ్ కేవ‌లం ఇండియాకే ప‌రిమితం కాకుండా అంత‌ర్జాతీయంగానూ విస్త‌రించింది. దాంతో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలపై అంచనాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. అంతేకాదు, ఇక ప్రభాస్ సినిమా చేస్తే.. పాన్ ఇండియా లెవెల్‌లోనే ఉండాలన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్. దాంతో ప్రభాస్ కూడా తన స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి, ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి అలాంటి చిత్రాలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. కాగా, ప్రభాస్.. ప్రస్తుతం […]

Update: 2020-08-05 07:28 GMT
ప్రభాస్@22 పౌరాణిక చిత్రమా?
  • whatsapp icon

‘బాహుబ‌లి’ సినిమాతో అసాధార‌ణ మాస్ ఇమేజ్‌ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. ఆయ‌న స్టార్‌డ‌మ్ కేవ‌లం ఇండియాకే ప‌రిమితం కాకుండా అంత‌ర్జాతీయంగానూ విస్త‌రించింది. దాంతో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలపై అంచనాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. అంతేకాదు, ఇక ప్రభాస్ సినిమా చేస్తే.. పాన్ ఇండియా లెవెల్‌లోనే ఉండాలన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్. దాంతో ప్రభాస్ కూడా తన స్టార్‌డమ్‌ను కాపాడుకోవడానికి, ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి అలాంటి చిత్రాలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. కాగా, ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తుండగా.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. మరి నెక్ట్స్ ఏంటీ?

ప్రస్తుతం పీరియాడికల్ మూవీగా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు టీ -సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనికంటే ముందు ప్రభాస్ చేసిన ‘సాహో’కు కూడా టీ-సిరీస్ వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో టీ – సిరీస్ వారు యంగ్ రెబల్ స్టార్‌తో మూడో చిత్రంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇదో పౌరాణిక చిత్రమని తెలుస్తుండగా.. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ప్రభాస్‌కి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభాస్ ఈ చిత్రానికి ఓకే చెబితే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’తో పాటు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.

Tags:    

Similar News