అవసరమైతే లాక్‌డౌన్ విధిస్తాం : కర్నాటక సీఎం

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో కరోనా కేసులు నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి బి.ఎస్ యడియూరప్ప సమీక్ష నిర్వహించారు. దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న ఐదు రాష్ట్రాలలో కర్నాటక కూడా ఉండటంతో అక్కడ లాక్‌డౌన్ విధించనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప స్పందిస్తూ.. రాష్ట్రంలో అవసరమైతే లాక్‌డౌన్ విధిస్తామని తెలిపారు. ‘ప్రజలు వారి మంచి కోసం నిబంధనలకు అనుగుణంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్లు అలా ఉండకపోతే మేం […]

Update: 2021-04-12 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో కరోనా కేసులు నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి బి.ఎస్ యడియూరప్ప సమీక్ష నిర్వహించారు. దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న ఐదు రాష్ట్రాలలో కర్నాటక కూడా ఉండటంతో అక్కడ లాక్‌డౌన్ విధించనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప స్పందిస్తూ.. రాష్ట్రంలో అవసరమైతే లాక్‌డౌన్ విధిస్తామని తెలిపారు. ‘ప్రజలు వారి మంచి కోసం నిబంధనలకు అనుగుణంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్లు అలా ఉండకపోతే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవసరముంటే లాక్‌డౌన్ కూడా విధిస్తాం..’ అని అన్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలలో నైట్ కర్ఫ్యూ విధించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

Tags:    

Similar News