మార్చిలో బహిరంగ సభ నిర్వహిస్తా : రేవంత్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి నెలలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నామని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్‌ను కలిశారు. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తాను రాష్ట్రంలో రైతుల కోసం తొమ్మిది రోజులపాటు చేపట్టిన రాజీవ్​ రైతు భరోసా పాదయాత్ర గురించి తికాయత్‌కు […]

Update: 2021-02-19 11:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి నెలలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నామని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్‌ను కలిశారు. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తాను రాష్ట్రంలో రైతుల కోసం తొమ్మిది రోజులపాటు చేపట్టిన రాజీవ్​ రైతు భరోసా పాదయాత్ర గురించి తికాయత్‌కు వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రైతు సమస్యలపై మార్చిలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. సభకు రావసిందిగా రాకేష్‌ తికాయత్‌ను ఆహ్వానించామని తెలిపారు.

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేశారని ఆరోపించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనన ముగిసిందని అనుకున్న తరుణంలో ఆందోళనకు కొత్త ఊపిరి పోసిన నేత రాకేష్ తికాయత్‌ అని కొనియాడారు. దేశంలోని చాలా మంది ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనను కలిసి ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇదే నేపథ్యంలో తాము కూడా ఆయనను కలిసి అభినందించామన్నారు. తెలంగాణలో జరిగే రైతుల బహిరంగ సభకు హాజరవుతానని తికాయత్​ హామీ ఇచ్చారని రేవంత్​రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News