కరోనాపై డ్రోన్ల దాడికి అజిత్ హెల్ప్

దిశ, వెబ్‌డెస్క్: హీరో అజిత్ కుమార్… తమిళ సూపర్ స్టార్. కమల్, రజినీల తర్వాత అంత పేరున్న నటుడు కూడా. బాక్సాఫీస్ రికార్డ్‌లను తిరగరాసే సత్తా ఉన్న తాలా అజిత్… శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయబోతున్నాడు. ఏదైనా సినిమాలో సైంటిస్ట్‌గా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకునేరు.. రియల్ లైఫ్‌లోనే ఓ ప్రాజెక్ట్‌లో పాల్గొనబోయే చాన్స్ ఉంది. అన్నా విశ్వవిద్యాలయం, MIT సెంటర్ ఫర్ ఏరోస్పేస్ రీసెర్చ్ సెంటర్ 20 ఏళ్లుగా డ్రోన్ల పరిశోధనలు చేస్తున్నాయి. డ్రోన్లను ప్రజలకు సహయపడేలా మార్చాలన్న […]

Update: 2020-03-29 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరో అజిత్ కుమార్… తమిళ సూపర్ స్టార్. కమల్, రజినీల తర్వాత అంత పేరున్న నటుడు కూడా. బాక్సాఫీస్ రికార్డ్‌లను తిరగరాసే సత్తా ఉన్న తాలా అజిత్… శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయబోతున్నాడు. ఏదైనా సినిమాలో సైంటిస్ట్‌గా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకునేరు.. రియల్ లైఫ్‌లోనే ఓ ప్రాజెక్ట్‌లో పాల్గొనబోయే చాన్స్ ఉంది.

అన్నా విశ్వవిద్యాలయం, MIT సెంటర్ ఫర్ ఏరోస్పేస్ రీసెర్చ్ సెంటర్ 20 ఏళ్లుగా డ్రోన్ల పరిశోధనలు చేస్తున్నాయి. డ్రోన్లను ప్రజలకు సహయపడేలా మార్చాలన్న డాక్టర్ A.P.J. అబ్థుల్ కలాం కలను సాకారం చేసేందుకు అన్నా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిని నివారించేందుకు తమిళనాడులోని కోయంబేడు ప్రాంతపై డ్రోన్ల ద్వారా శానిటైజర్లను పిచికారి చేయాలని నిర్ణయించింది. సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలనే ఆలోచనతో తరంగాలను తయారు చేసింది టీం ధాక్షా.

అయితే కరోనా వైరస్ అరికట్టేందుకు జరిపే డ్రోన్ వినియోగంలో అవసరమైతే అజిత్ సహాయం తీసుకుంటామని తెలిపారు అన్న విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ & డైరెక్టర్ ఇన్ఛార్జి డాక్టర్ కె. సెంథిల్‌కుమార్. వైమానిక వాహనాల రూపకల్పనలో అజిత్‌కు నైపుణ్యం ఉందని.. తప్పకుండా సంప్రదిస్తామని తెలిపారు.

Tags: Ajith Kumar, Tamil, Dhaksha, Drones, CoronaVirus, Covid19

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma