భార్యను చంపిన భర్త వ్యసనం..

దిశ, పటాన్‌చెరు : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. SI పి.రామనాయుడు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్‌పూర్‌కు చెందిన సరిత(26) ఆందోల్ మండలం అక్సాన్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బాలరాజుకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 10 ఏళ్ల కిందట దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వచ్చారు. బాలరాజు మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ […]

Update: 2021-12-04 09:51 GMT

దిశ, పటాన్‌చెరు : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. SI పి.రామనాయుడు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్‌పూర్‌కు చెందిన సరిత(26) ఆందోల్ మండలం అక్సాన్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బాలరాజుకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 10 ఏళ్ల కిందట దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వచ్చారు. బాలరాజు మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మద్యానికి బానిసైన బాల రాజు డబ్బులు తీసకుని రమ్మని భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవాడని మృతురాలి తల్లి దుర్గమ్మ తెలిపింది. పెళ్లి సమయంలో తన కూతురుకు ఇచ్చిన 4 తులాల బంగారం సైతం అల్లుడు అమ్ముకున్నాడని, అల్లుడి వేధింపులు భరించలేకే తన కూతురు శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. సరిత తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Tags:    

Similar News