మోసం చేసిన భర్తను చంపి.. తాపీగా కూర్చుని అందరికి ఫోన్ చేసిన భార్య

దిశ,వెబ్‌డెస్క్ :వాళ్లిద్దరు ప్రేమికులు. మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అప్పుడే కథ అడ్డం తిరిగింది. ప్రేమవివాహంతో సంతోషంగా సాగిపోతున్న ఆ ఇద్దరి  జీవితాల్లోకి మరో యువతి ఎంటరైంది. దీంతో భార్య- భర్తల మధ్య పొరపొచ్చలొచ్చాయి. భర్త, భార్యను పట్టించుకోవడం మానేశాడు. మరో యువతితో ప్రేమాయణం నెరుపుతున్నాడు. అదే నిజమైతే తన భవిష్యత్ ఏమవుతుందోనని అర్ధం చేసుకున్న భార్య… మనం అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందాం అంటూ భర్తపై ఒత్తిడి […]

Update: 2021-01-11 22:04 GMT

Full View

దిశ,వెబ్‌డెస్క్ :వాళ్లిద్దరు ప్రేమికులు. మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అప్పుడే కథ అడ్డం తిరిగింది. ప్రేమవివాహంతో సంతోషంగా సాగిపోతున్న ఆ ఇద్దరి జీవితాల్లోకి మరో యువతి ఎంటరైంది. దీంతో భార్య- భర్తల మధ్య పొరపొచ్చలొచ్చాయి. భర్త, భార్యను పట్టించుకోవడం మానేశాడు. మరో యువతితో ప్రేమాయణం నెరుపుతున్నాడు. అదే నిజమైతే తన భవిష్యత్ ఏమవుతుందోనని అర్ధం చేసుకున్న భార్య… మనం అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందాం అంటూ భర్తపై ఒత్తిడి తెచ్చింది. కానీ భర్త మాత్రం మరోసారి తన భార్యను బహిరంగంగా పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. భార్య రెండో సారి పెళ్లి చేసుకుందామనే ప్రస్తావన తెచ్చినప్పుడల్లా భర్త దాటవేస్తున్నాడు. ఇలా అయితే లాభం లేదని భార్య అనుకుందేమో మాట్లాడుకుందాం అంటూ భర్తకు కబురు పెట్టింది. ఇద్దరు మాట్లాడుకొని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా బైక్ పై భర్త వెనుక కూర్చున్న భార్య తన దగ్గరున్న కత్తితో భర్తను పొడిచింది. ఈ దారుణాన్ని తట్టుకోలేని భర్త బైక్ ఆపేశాడు. కింద పడి ఆర్తనాదాలు చేస్తున్నాడు. చివరికి భర్త ఎటూ కదలడని నిర్ధారించుకుని..,రక్తపు మడుగులో ఉన్న భర్తను మరోసారి పొడిచింది. ఈ దారుణంలో భర్త మృతి చెందగా తాపీగా బాధితుడి డెడ్ బాడీ పక్కన కూర్చొని అందరికి ఫోన్ చేసి హత్య గురించి చెప్పింది.

తాళ్లపుడి మండలం మలకపల్లికి చెందిన పావని, తాడేపల్లిగూడానికి చెందిన తాతాజి నాయుడు 3ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొంతకాలం క్రితం ఎవరికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో భర్త తాతాజీ నాయుడు పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. పావనీని పట్టించుకోవడం మానేశాడు. దీంతో భర్త మోసాన్ని కనిపెట్టిన భార్య తనని అందరి సమక్షంలో తనని రెండోసారి పెళ్లి చేసుకోవాలని పావని తాతాజిపై ఒత్తిడి తెచ్చింది. దీన్ని అంగీకరించని భర్త సాకులు చెబుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. పావని భర్త తాతాజి నాయుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. చివరికి మాట్లాడుకుందాం రావాలని తాతాజిని పిలిపించింది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తరువాత బైక్ పై బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డు మార్గం మధ్యలో బండి నడుపుతున్న తాతాజిని వెనక కూర్చున్న పావని కత్తితో పోడిచింది. బాధితుడు బండి ఆపడంతో మరోసారి కత్తితో పొడిచింది. తీవ్రగాయాలైన భర్త మరణించగా.., అతని శవం పక్కన తాపీగా కూర్చున్న పావని..తాతాజిని హత్య చేశానంటూ అందరికి ఫోన్ చేసింది. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News