ఐపీఎల్ షెడ్యూల్‌పై స్టార్ స్పోర్ట్స్ అసహనం

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్య ఈ మెగా లీగ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. కాగా, బీసీసీఐ నిర్ణయించిన ఈ షెడ్యూల్‌పై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నవంబర్ 14న దీపావళి వీకెండ్‌‌కు ఫైనల్స్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. దీనిపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. గత కొన్నేండ్లుగా దీపావళి రోజు మ్యాచ్ […]

Update: 2020-07-20 07:17 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్య ఈ మెగా లీగ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. కాగా, బీసీసీఐ నిర్ణయించిన ఈ షెడ్యూల్‌పై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నవంబర్ 14న దీపావళి వీకెండ్‌‌కు ఫైనల్స్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. దీనిపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. గత కొన్నేండ్లుగా దీపావళి రోజు మ్యాచ్ ఆడితే దానికి టీవీల్లో సరైన రేటింగ్స్ రావట్లేదని చెప్పింది. ప్రజలందరూ దీపావళి సంబరాల్లో మునిగి తేలుతూ ఆ రోజు ఎంత మంచి మ్యచ్ అయినా ఎక్కువ మంది చూడట్లేదని బార్క్ రేటింగ్స్‌లో తేలిందని చెబుతున్నది. అంతేకాకుండా పండగ రోజు ఆటగాళ్లు తమ కుటుంబాలతో గడిపే వెసులుబాటు కల్పించడానికే దీపావళి కంటే ముందే ఐపీఎల్‌ను ముగిస్తున్నట్లు బీసీసీఐ వివరించింది.

Tags:    

Similar News