పొలిటికల్ హీట్.. మరోసారి తెరపైకి ‘దళిత’ సీఎం

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో దళితుల ఎంపవర్‌మెంట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి నిలదీశారు. మరియమ్మ ఘటన గురించి తెలియదని వ్యాఖ్యానించిన కేసీఆర్..​ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక హక్కును కోల్పోయారన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో దళిత ఆవేదన దీక్ష శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయా వర్గాలు భారీగా తరలివచ్చాయి. మధ్యాహ్నం వరకు దళిత ఆవేదన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా లాకప్​డెత్‌తో […]

Update: 2021-06-26 03:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో దళితుల ఎంపవర్‌మెంట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి నిలదీశారు. మరియమ్మ ఘటన గురించి తెలియదని వ్యాఖ్యానించిన కేసీఆర్..​ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక హక్కును కోల్పోయారన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో దళిత ఆవేదన దీక్ష శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయా వర్గాలు భారీగా తరలివచ్చాయి. మధ్యాహ్నం వరకు దళిత ఆవేదన దీక్షను నిర్వహించారు.

ఈ సందర్భంగా లాకప్​డెత్‌తో మరణించిన మరియమ్మకు నివాళులర్పించారు. అంనతరం టీపీసీసీ చీఫ్​ఉత్తమ్​మాట్లాడుతూ.. మరియమ్మ లాకప్​డెత్ అత్యంత దారుణమని, పిల్లల ముందే ఆమెను కొట్టి చంపారన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది మాదిగలు ఉన్నారని, వీరికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈరోజు దళిత వర్గాలతో అవసరం ఏర్పడిందని గుర్తించిన కేసీఆర్..​ఎస్సీ ఎంపవర్‌మెంట్​గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏడేండ్లు దళితుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ఉత్తమ్​ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు దళిత సీఎం అన్ని ప్రకటించాడని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

దళితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని, ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేయలేదని, కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. దళితులకు గతంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న తర్వాతే.. ఎస్సీ ఎంపవర్‌మెంట్ గురించి మాట్లాడాలని సీఎంకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, మైనార్టీలు, బీసీల పక్షాల ఉంటుందన్నారు. నాలుగు పార్టీలు మారిన బీజేపీ వాళ్లు.. కాంగ్రెస్​ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీల్లో కుస్తీ అన్నట్టుగా టీఆర్‌ఎస్, బీజేపీ వ్యవహారం ఉందని, కేంద్రానికి అన్ని అంశాల్లో సపోర్ట్​చేశారని ఆరోపించారు. బీజేపీ.. దళిత వ్యతిరేకి అని ఉత్తమ్​ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అమరులైన 1500 మందిలో ఎక్కువ దళితులే ఉన్నారన్నారు. భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ భయపడ్డాడని, అందుకే మరియమ్మకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, మరియమ్మ మృతితో మొదలైన ఉద్యమం కొనసాగుతుందన్నారు. దళితులకు ఏం చేయలేదని, తప్పును ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, బలరాం నాయక్, బొల్లు కిషన్, మానవతారాయ్, నమిండ్ల శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్​కుమార్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News