లాక్‌డౌన్‌ను స్వాగతించిన డబ్ల్యూహెచ్‌ఓ

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్వాగతించింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు లాక్‌డౌన్‌ను మించిన పరిష్కారం లేదని.. ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయమని డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ కొనియాడారు. కరోనాపై పోరాటంలో భారత్ చిత్త శుద్ధి అనన్యసామాన్యమని, దేశం ఎంతో దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోందని కొనియాడారు. కాగా, వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ఇది ఎంత వరకు […]

Update: 2020-04-14 05:00 GMT

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్వాగతించింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు లాక్‌డౌన్‌ను మించిన పరిష్కారం లేదని.. ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయమని డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ కొనియాడారు. కరోనాపై పోరాటంలో భారత్ చిత్త శుద్ధి అనన్యసామాన్యమని, దేశం ఎంతో దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోందని కొనియాడారు. కాగా, వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ఇది ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాఖ్యానించింది. కాగా, లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇండ్లకే పరిమితం అవడం, బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం పాటించడం వంటివి కరోనా వ్యాప్తి వేగాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కాని కేవలం లాక్‌డౌన్‌కే పరిమితం కాకుండా అనుమానితులను గుర్తించడం, వారిని వేరు చేయడం, పరీక్షలు నిర్వహించి, రోగులకు అవసరమైన చికిత్స చేయడం తప్పకుండా చేయాలని.. ఇదొ ఒక నిరంతర ప్రక్రియ అని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

Tags: WHO, lockdown, welcome, move, extend

Tags:    

Similar News