బర్డ్ ఫ్లూ.. చికెన్ తినవచ్చా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది?
దిశ,వెబ్‌డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిజమేనని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బటయపడ్డాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తున్దని. ఏది ఏమైనా దేశంలో ఇప్పటివరకైతే మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదు. అసలు బర్డ్ ఫ్లూ ఏమిటీ? డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇది ఓ రకమైన ఇన్‌ఫ్లూయెంజా […]
దిశ,వెబ్‌డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిజమేనని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బటయపడ్డాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తున్దని. ఏది ఏమైనా దేశంలో ఇప్పటివరకైతే మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదు.
అసలు బర్డ్ ఫ్లూ ఏమిటీ?
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇది ఓ రకమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్(హెచ్5ఎన్1 వైరస్). ఈ వ్యాధి వల్ల పక్షులకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అప్పుడప్పుడు మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంటుంది. హెచ్5ఎన్1 వైరస్ సోకిన , మృత్యువాత పడిన పక్షులకు అత్యంత సమీపంగా వెళ్లినప్పుడు మనుషులకు సోకే ప్రమాదం ఉన్నది.కానీ, ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన దాఖలాలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్, బాతులు, గుడ్లు తినడం ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్న అందరి మెదడులను తొలుస్తున్నది. డబ్ల్యూహెచ్‌ఓ ఏమి చెబుతున్నది ఓసారి పరిశీలిద్దాం!
ఇలా తినవచ్చు..
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సరైన పద్ధతిలో వండిన చికెన్, గుడ్లు తినడం పూర్తిగా సురక్షితం. వేడిని తట్టుకుని బతికే శక్తి వైరస్‌కు ఉండదు. ఈ నేపథ్యంలో 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత(మన దేశంలో సాధారణంగా వంట చేసేందుకు అవసరమయ్యే ఉష్ణోగ్రత) వద్ద వంట చేయడం ద్వారా ఆహారంలో వైరస్ చనిపోతుంది. అయితే, చికెన్, గుడ్లు, ఇతర పక్షులను పరిశుభ్రం చేయడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడానికి గల కారణాలపై కూడా డబ్ల్యూహెచ్ఓ వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఇంట్లో కోళ్లు, బాతులను వధించడం లేదా వైరస్ సోకిన పక్షులను పట్టుకోవడం లేదా మృత్యువాతపడిన పక్షులను వండటం వల్ల మనుషులకు బర్డ్ ఫ్లూ సంక్రమించే అవకాశం ఉన్నది. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తున్నది.