అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐ ఎక్కడిది: కోదండరాం

దిశ, జనగామ: ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశు రామ్ చేస్తున్న ప్రజా చైతన్య రధయాత్రకు తెలంగాణ జన సమితి జాతీయ అధ్యక్షులు కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారు. జనగామ చౌరస్తాలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సాధన సమితి సభ్యులు ఆయనకు ఘనoగా స్వాగతం పలికారు.ఈ సందర్బంతా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ… ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఫోటో‌ను కచ్చితంగా కరెన్సీ నోట్‌పై ముద్రించాలని డిమాండ్ […]

Update: 2021-01-09 06:52 GMT

దిశ, జనగామ: ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశు రామ్ చేస్తున్న ప్రజా చైతన్య రధయాత్రకు తెలంగాణ జన సమితి జాతీయ అధ్యక్షులు కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారు. జనగామ చౌరస్తాలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సాధన సమితి సభ్యులు ఆయనకు ఘనoగా స్వాగతం పలికారు.ఈ సందర్బంతా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ… ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఫోటో‌ను కచ్చితంగా కరెన్సీ నోట్‌పై ముద్రించాలని డిమాండ్ చేశారు.

ఇంపీరియల్ బ్యాంక్ కుప్ప కూలినప్పుడు సగటు వ్యక్తి కోణంలో నుంచి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకా న్ని 1926 అంబేద్కర్ రాశారాని తెలిపారు. ఆ తర్వాత దాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల అవసరాన్ని గుర్తించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందన్నారు. ఆర్బీఐని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Tags:    

Similar News