ఆపద ఎక్కడ ఉంటే అక్కడే కమిషన్..!
దిశ, గజ్వేల్: ఆపద ఎక్కడ ఉంటే కమిషన్ అండగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరంలో ఎర్రోళ్ళ శ్రీనివాస్ శనివారం పర్యటించారు. గతంలో అత్యాచారానికి గురైన బాధితురాలికి నష్టపరిహారంగా రూ.5,18,700 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, దేవి రవిందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ […]
దిశ, గజ్వేల్: ఆపద ఎక్కడ ఉంటే కమిషన్ అండగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరంలో ఎర్రోళ్ళ శ్రీనివాస్ శనివారం పర్యటించారు. గతంలో అత్యాచారానికి గురైన బాధితురాలికి నష్టపరిహారంగా రూ.5,18,700 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, దేవి రవిందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా కమిషన్ పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికీ పది వేల అట్రాసిటీ కేసులు పరిష్కరిస్తూ.. ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని బాధితులకు అందజేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మనోధైర్యం కలిపిస్తూ.. వారికి పూర్తి భరోసా కలిపించిన ఘనత కమిషన్‌కే దక్కుతుందన్నారు.