నివారణకు శానిటైజర్లు.. మాస్కులేవీ?
దిశ, హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ కరోనా జపం చేస్తున్నాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మరో వైపు కరోనాపై నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ.. అటు ప్రజల్లోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ తేలిన కరోనా.. తాజాగా ఒక పేషెంట్ నుంచి మరో వ్యక్తికి కరోనా సోకిన కేసును […]
దిశ, హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ కరోనా జపం చేస్తున్నాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మరో వైపు కరోనాపై నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ.. అటు ప్రజల్లోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ తేలిన కరోనా.. తాజాగా ఒక పేషెంట్ నుంచి మరో వ్యక్తికి కరోనా సోకిన కేసును ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిలో ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన ఉంది. ఇప్పటికే ఆదివారం రోజంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రభుత్వాధినేతలు కార్యచరణ ప్రకటించాయి.
మాస్కులు.. శానిటైజర్ల కొరత:
వాస్తవానికి కరోనా వైరస్ 2019 నవంబర్లో చైనా దేశంలో మొదలైంది. ఈ వైరస్ను నివారించేందుకు మందు లేకపోవడంతో నాలుగు నెలల కాలంలోనే ప్రపంచ దేశాలన్నీ చుట్టేసింది. కులం, మతం, ప్రాంతం, దేశాలు అంటూ తేడా లేకుండా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన బాధితులు ఇప్పటి వరకూ 10 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా.. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే వారిని ప్రమాద ఘంటికలు మొదలైనప్పట్నుంచే ప్రభుత్వాలు నివారణన చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, దీనిని నివారించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పా వేరే మార్గం లేకపోవడంతో అనుమానితులను క్వారంటైన్ చేయడం తప్పా ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఇతరుల నుంచి కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలోనూ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో లేవంటే ఆశ్చర్యపోవాల్సిన దుస్థితే. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 12 వేలకు పైగా మెడికల్ షాపులు ఉన్నా.. మాస్కులు, శానిటైజర్లు లభించడం లేదు. ఒకవేళ కొద్దో గొప్పో స్టాక్ ఉన్న వారు మాత్రం రూ.2 లకు విక్రయించే మాస్కులు రూ.30లు, రూ.60 లకు అమ్మాల్సిన పరిస్థితి. ఎన్-95 మాస్కులు అయితే ఏకంగా రూ.300లకు పైగా అమ్ముతున్నారు. శానిటైజర్లను కూడా మెడికల్ దుకాణాదారులు యాజమానులు అధిక రేట్లకు అమ్ముతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సేఫ్టీ నిల్:
వివిధ పౌర సేవల నిమిత్తం ప్రజలు తరుచూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుంటారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాలలోనూ అక్కడి సిబ్బందికి మాస్కులు లేకపోవడం, కార్యాలయాలకు వచ్చే వారికి కూడా ప్రభుత్వం శానిటైజర్లను అందుబాటులో ఉంచలేకపోతోంది. పోలీసు శాఖ మాత్రం మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతుండుగా, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ, విద్యా తదితర విభాగాలలో అసలేమాత్రం నివారణ చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు తమ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలంటేనే భయపడాల్సిన వస్తోంది. అంతే కాకుండా, ప్రభుత్వ విభాగాలకు చెందిన చాలా మంది అధికారులు కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధులు సైతం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా నివారణ విధులు ముగించుకుని నేరుగా కార్యాలయాలకు వస్తే, అక్కడ శానిటైజర్, మాస్కులు లాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించే పద్దతులు లేకుంటే ముంచుకొచ్చే ప్రమాదాలను ఎవరు మాత్రం ఊహించగలరు. ఇదే విషయాన్ని పలువురు ప్రభుత్వాధికారులను అడగగా.. ప్రభుత్వం కనీసం మాస్కులు, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచకపోతే తమ ప్రాణాలను గాలికొదిలేసి విధులు ఎందుకు చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలలో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
Tags: Masks, Sanitizer, Corona Virus, Hyderabad, Government Offices