నగరంలో నిరుపేదలకు సహాయం.. దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ
దిశ, శేరిలింగంపల్లి: కార్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సుమన్- మంజులత దంపతులు, యూబీఎస్ సంస్థ ఎండీ సిమర్ డి.సింగ్, డైరెక్టర్ యండూరి పద్మనాభం సహకారంతో మంగళవారం అల్వీన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో గల కార్డ్ సేవా సంస్థ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా దివ్యాంగులకు వీల్ చైర్స్, మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, […]
దిశ, శేరిలింగంపల్లి: కార్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సుమన్- మంజులత దంపతులు, యూబీఎస్ సంస్థ ఎండీ సిమర్ డి.సింగ్, డైరెక్టర్ యండూరి పద్మనాభం సహకారంతో మంగళవారం అల్వీన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో గల కార్డ్ సేవా సంస్థ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా దివ్యాంగులకు వీల్ చైర్స్, మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ .. కార్డ్ సంస్థకు సహకరించిన యూబీఎస్ వారిని ఘనంగా సన్మానించారు. కార్డ్ సంస్థ సేవలు అభినందనీయమని, పేద, బడుగు వర్గాలకు అండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తుంనందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్డ్ వ్యవస్థాపకులు సుమన్ మల్లాది మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్డ్ సంస్థలో 100 మందికి కుట్టుమిషన్ ట్రైనింగ్ పూర్తయిందని, మరో 40 మంది ట్రైనింగ్ లో ఉన్నారని, అలాగే 100 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్, జిల్లా గణేష్, మోసెస్, అగ్రవాసు, వెంకట్ నాయక్, రాములు గౌడ్, యాదగిరి, దుర్గేష్, జగదీష్, శిరీష సత్తూర్, రాజ్యలక్ష్మి, మధులత, స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.