వాట్సాప్‌లో మేనేజింగ్ స్టోరేజ్ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం లేచింది మొదలు.. అర్ధ రాత్రుల వరకు ‘వాట్సాప్’లో మెసేజ్‌లు, ఫొటోలతో పాటు వీడియోలు వస్తూనే ఉంటాయి. గ్రూపుల్లో డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. ప్రతీరోజు వాట్సాప్‌లో బోలెడంత కంటెంట్ వచ్చి పడుతూనే ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయడం మాత్రం ఓ పెద్ద ప్రాసెస్. ఈ సమస్యకు వాట్సాప్ సులువైన పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై బల్క్ మెసేజ్‌లు డిలీట్ చేయడం చాలా ఈజీ. అందుకోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం లేచింది మొదలు.. అర్ధ రాత్రుల వరకు ‘వాట్సాప్’లో మెసేజ్‌లు, ఫొటోలతో పాటు వీడియోలు వస్తూనే ఉంటాయి. గ్రూపుల్లో డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. ప్రతీరోజు వాట్సాప్‌లో బోలెడంత కంటెంట్ వచ్చి పడుతూనే ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయడం మాత్రం ఓ పెద్ద ప్రాసెస్. ఈ సమస్యకు వాట్సాప్ సులువైన పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై బల్క్ మెసేజ్‌లు డిలీట్ చేయడం చాలా ఈజీ. అందుకోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ మొబైల్స్‌లో స్టోరేజ్ డేటాను పెంచుకోవచ్చు.
త్వరలోనే స్టోర్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. యాప్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లినట్టయితే.. స్టోరేజ్ అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుందని, రాబోయే వాట్సాప్ అప్‌డేట్‌లో తప్పనిసరిగా ఈ టూల్ ఉంటుందని తెలిపింది. 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైల్‌ను ఈ ఫీచర్ గుర్తించడంతో పాటు ఫైల్ సైజ్‌ను బట్టి డిసెండింగ్ ఆర్డర్‌లో వాటిని వినియోగదారులకు చూపిస్తుంది. బల్క్ మెసేజ్‌లను డిలీట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇటీవలే వాట్సాప్ డిసప్పయరింగ్ మెసెజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఏడు రోజుల తర్వాత.. మనం షేర్ చేసిన మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతోంది.