ఐఫోన్ నుంచి ఏ ఫోన్‌కైనా వాట్సాప్ హిస్టరీ బదిలీ సాధ్యమే

దిశ, ఫీచర్స్ : ఆండ్రాయిడ్ 12 యూజర్లు ప్రస్తుతం తమ వాట్సాప్ చాట్ హిస్టరీని ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు సురక్షితంగా బదిలీ చేసుకోవచ్చని గూగుల్ తాజాగా ప్రకటించింది. గతంలో ఎంపిక చేసిన శాంసంగ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ యూజర్లందరూ ఉపయోగించుకోగలరని తెలిపింది. కొత్త సామర్థ్యాలను రూపొందించేందుకు వాట్సాప్ బృందంతో కలిసి పని చేసినట్లు వెల్లడించిన గూగుల్.. ఇక ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ హిస్టరీని బదిలీ […]

Update: 2021-10-27 07:46 GMT

దిశ, ఫీచర్స్ : ఆండ్రాయిడ్ 12 యూజర్లు ప్రస్తుతం తమ వాట్సాప్ చాట్ హిస్టరీని ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు సురక్షితంగా బదిలీ చేసుకోవచ్చని గూగుల్ తాజాగా ప్రకటించింది. గతంలో ఎంపిక చేసిన శాంసంగ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ యూజర్లందరూ ఉపయోగించుకోగలరని తెలిపింది. కొత్త సామర్థ్యాలను రూపొందించేందుకు వాట్సాప్ బృందంతో కలిసి పని చేసినట్లు వెల్లడించిన గూగుల్.. ఇక ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ హిస్టరీని బదిలీ చేసుకోవచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ 12తో వచ్చే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్‌లో ఈ ఫీచర్(ట్రాన్స్‌ఫర్ టూల్‌)ను రాబోయే నెలల్లో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. పరికరాల మధ్య డేటా సురక్షితంగా బదిలీ చేయబడుతుందని.. వినియోగదారులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది

ఐవోస్ టు ఆండ్రాయిడ్‌కు చాట్ బదిలీ?

ఈ బదిలీ కోసం గూగుల్ వినియోగదారులకు USB-C కేబుల్ అవసరం కాగా, రెండు ఫోన్లను కేబుల్స్ ఉపయోగించి కనెక్ట్ చేయాలి. కొత్త ఆండ్రాయిడ్ డివైజ్ సెటప్ చేసే సమయంలో ప్రాంప్టింగ్ తర్వాత వాట్సాప్‌ లాంచ్ చేయడానికి ఐఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. అప్పుడు చాట్స్, మీడియా, క్యాలెండర్‌, SMS, iMessage సహా ఇతర విషయాలను పిక్సెల్ ఫోన్‌కు బదిలీ చేయాలి.

Tags:    

Similar News