వాట్సాప్‌లో కొత్త ఎమోజీలు

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు న్యూ అప్‌డేట్స్, న్యూ ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటితో పాటు 138 కొత్త ఎమోజీలను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. స్టిక్కర్లు, ఎమోజీలు.. వాట్సాప్ మెసేజ్‌లో కీ ఎలిమెంట్స్‌గా ఉంటాయని అందరికీ తెలిసిందే. యూజర్ల ఫీలింగ్స్, మూడ్, ఎక్స్‌ప్రెషన్స్‌ను రిప్రెజెంట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, యూజర్లను ఎంటర్‌టైన్ చేయడంలోనూ ఎమోజీలు కీలకంగా ఉంటాయి. […]

Update: 2020-08-04 00:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు న్యూ అప్‌డేట్స్, న్యూ ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటితో పాటు 138 కొత్త ఎమోజీలను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. స్టిక్కర్లు, ఎమోజీలు.. వాట్సాప్ మెసేజ్‌లో కీ ఎలిమెంట్స్‌గా ఉంటాయని అందరికీ తెలిసిందే. యూజర్ల ఫీలింగ్స్, మూడ్, ఎక్స్‌ప్రెషన్స్‌ను రిప్రెజెంట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, యూజర్లను ఎంటర్‌టైన్ చేయడంలోనూ ఎమోజీలు కీలకంగా ఉంటాయి.

ఎన్నో పదాలు వ్యక్తీకరించలేని భావాన్ని ఓ ఫొటో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతుందో.. ఎమోజీ, స్టిక్కర్లు కూడా అంతే. అందుకే ఎంతోమంది వినియోగదారులు చాటింగ్‌లో ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ కొత్త అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్ 2.20.197.6 బీటాలో వస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉప‌యోగిస్తున్న వినియోగ‌దారుల‌కు ఇవి ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త ఎమోజీలు కాస్త భిన్నంగా క‌నిపించ‌బోతున్నాయి. వీటిలో భిన్నరకాల క్లాత్స్, హెయిర్ స్టైల్స్, స్కిన్ టోన్స్‌లో తేడాలు ఉండనున్నాయి.

Tags:    

Similar News