ఇంటింటి సర్వేతో లాభామేమిటీ…?

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇంటింటి ఫీవర్ సర్వేతో కరోనా కేసులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారులకు సకాలం సర్వే నిర్ణయించి కేసుల వివరాలతో పాటు కరోనా కిట్లు పంపిణీ చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పరికరాలను సర్వే చేసే టీంకు ఇవ్వాలి. ధర్మల్ స్కానర్‌తో టెంపరేచర్, ఆక్సిమీటర్‌తో పల్స్ రేట్, ఆక్సీజన్ లేవల్‌ను రికార్డు చేసే పరికరాలతో వైరస్ ఉన్నవాళ్లను గుర్తించే అవకాశం ఉంది. ఇందులో ఏ ఒక్క పరికరం […]

Update: 2021-05-08 13:38 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇంటింటి ఫీవర్ సర్వేతో కరోనా కేసులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారులకు సకాలం సర్వే నిర్ణయించి కేసుల వివరాలతో పాటు కరోనా కిట్లు పంపిణీ చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పరికరాలను సర్వే చేసే టీంకు ఇవ్వాలి. ధర్మల్ స్కానర్‌తో టెంపరేచర్, ఆక్సిమీటర్‌తో పల్స్ రేట్, ఆక్సీజన్ లేవల్‌ను రికార్డు చేసే పరికరాలతో వైరస్ ఉన్నవాళ్లను గుర్తించే అవకాశం ఉంది. ఇందులో ఏ ఒక్క పరికరం లేకుండానే సర్వే చేయడంతో ఫలితం ఏముంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటే చేప్పే వివరాలతో నిర్ధిష్టమైన ఫలితాలు వస్తాయా అని చర్చ సాగుతుంది. ప్రస్తుతం చేస్తున్న సర్వేతో రంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల్లో లక్షకు పైగా ఇండ్లను, వికారాబాద్ జిల్లాలో ఒక్క రోజులో సుమారుగా 43వేల ఇండ్లకు పైగా సర్వే చేసినట్లు సమాచారం. అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు జిల్లా వైద్యాధికారులు జంకుతున్నారు. ఏ సమాచారం అడిగేందుకు ప్రయత్నం చేసినా.. అధికారులు స్పందించకపోవడం.. వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలుస్తోంది.

ఇంటి ఓనర్ ఏం చేబితే అదే…

రంగారెడ్డి జిల్లాలో 6లక్షలకుపైగా, వికారాబాద్ జిల్లాలో 2లక్షలకు వరకు ఇండ్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 560 పంచాయతీలు, 11 మున్సిపాలిటీలు, వికారాబాద్ జిల్లాలో 566 పంచాయతీలు, 4 మున్సిపాలిటీలున్నాయి. ఇంటింటి సర్వే కోసం అందుబాటులోనున్న సిబ్బందిని బట్టి టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఏఎన్ఎం, ఆశా, మున్సిపాలిటీ, పంచాయతీ వర్కర్ అంగన్ వాడీ వర్కర్ ఉండాల్సి ఉంది. అయితే జిల్లాల్లో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు సరిపోను లేరు. దీంతో కొన్ని గ్రామాల్లో పంచాయతీ, అంగన్ వాడీ కార్యకర్తలే ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రతి టీంకు థర్మల్ స్కానర్, పల్స్ ఆక్సీమీటర్ ఇవ్వాల్సి ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ అవేమి సమకూర్చకుండానే సర్వే చేయిస్తున్నారు. సర్వేకు వెళ్లిన టీం మెంబర్స్ ప్రతి కుటుంబ సభ్యులను జ్వరం, దగ్గు, జలుబు, సహా ఇతర హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకోవాలి. థర్మల్ స్కానర్తో జ్వరం, ఆక్సీమీటర్ ద్వారా శ్వాస, పల్స్ వివరాలను తెలుసుకోవాలి. కానీ అన్ని టీంల వద్ద ఇవి లేకపోవడంతో హౌజ్ ఓనర్స్ ఏం చెప్పారో అదే రాసుకొని వెళ్తున్నారు.

వేగంగా సర్వే..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఇంటింటి సర్వే వేగంగా కొనసాగుతుంది. రెండు రోజుల్లో రంగారెడ్డిలో 1,60,000లు, ఒక్క రోజులో వికారాబాద్లో 50వేల వరకు సర్వే నిర్వహించినట్లు సమాచారం. దీంతో రంగారెడ్డిలో 3వేల వరకు, వికారాబాద్లో 1000 వరకు కరోనా వైరస్ నమోదైయినట్లు తెలుస్తోంది. అయితే థర్మల్ స్కానర్, పల్స్ ఆక్సీమీటర్తో చేయకుండానే ఓనర్లు చెప్పిన వివరాలతోనే నమోదు చేశారు. అదే పరికరాల ఆధారంగా సర్వే చేస్తే ఇంకా ఎన్ని కేసులు నమోదైయ్యేవని ప్రజల్లో చర్చ సాగుతుంది.

కిట్ల పంపిణీ లేదు…

ఇంటింటి సర్వేలో కేవలం టీం అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని వ్రాసుకుంటున్నారు. ముందోస్తుగా కరోనా సోకితే కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా కరోనా వచ్చిన వ్యక్తులకు ఇంటింటి సర్వేలో కిట్ పంపిణీ చేయాలి. కానీ కిట్ల పంపిణీ లేదు.. ప్రజలకు భరోసా కల్పించే నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా సర్వే చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లా వైద్యాధికారుల స్పందించరు…

ప్రస్తుతం కరోనా వైరస్ మాహ్మామరి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వైద్యాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు, ఎదో ప్రజల సేవలోనే నిమగ్నమైనట్లు, బీజీగా ఉన్నామనే సమాధానంతో దాటవేస్తున్నారు. కానీ ప్రజలకు అందించాల్సిన కనీస సమాచారం ఇవ్వడంలో విఫలమైతున్నారు. రోజువారీగా ఎన్ని టెస్టులు చేస్తున్నారు…? ఎన్ని కేసులు నమోదైతున్నాయి..? ఎంత మందకి వాక్సీనేషన్ వేస్తున్నారనే సమాచారం విడుదల చేయడంలో ఫేల్యూర్ అవుతున్నారు. అడిగినప్పుడు ఎదో ఒక సమాచారం చెప్పి వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎన్ని టీంమ్లతో సర్వే చేస్తున్నారు. ఏవిధంగా చేస్తున్నారనే సమాచారం కోసం అధికారులకు ఫోన్లు చేసినా, మేసేజ్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.

Tags:    

Similar News