వాట్సాప్‌కు చెక్ పెడుతున్న ‘సిగ్నల్’

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న యాప్స్‌లో మైక్రో బ్లాగింగ్ సైట్ ‘వాట్సాప్’ ఒకటి. అయితే.. వాట్సాప్ కొత్తగా ప్రైవసీ పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘సిగ్నల్ యాప్’కు కస్టమర్లు స్విచ్ అవుతుండటం విశేషం. అయితే ఈ సిగ్నల్ యాప్ ఏంటి? ఈ మెసేజింగ్ యాప్ ఎలా పనిచేస్తుంది? ‘డిచ్ వాట్సాప్ .. స్విచ్ టు సిగ్నల్’ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. వాట్సాప్ ప్రైవసీ […]

Update: 2021-01-09 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న యాప్స్‌లో మైక్రో బ్లాగింగ్ సైట్ ‘వాట్సాప్’ ఒకటి. అయితే.. వాట్సాప్ కొత్తగా ప్రైవసీ పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘సిగ్నల్ యాప్’కు కస్టమర్లు స్విచ్ అవుతుండటం విశేషం. అయితే ఈ సిగ్నల్ యాప్ ఏంటి? ఈ మెసేజింగ్ యాప్ ఎలా పనిచేస్తుంది?

‘డిచ్ వాట్సాప్ .. స్విచ్ టు సిగ్నల్’ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీతో పాటు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా ‘యూజ్ సిగ్నల్’ అంటూ ట్వీట్ చేసిన నేపథ్యంలో.. మిలియన్లకొద్దీ ఉన్న ఎలన్ ఫాలోవర్స్ పోలోమంటూ ‘సిగ్నల్’ యాప్‌కు జంప్ చేస్తున్నారు. ఈ యాప్ 2014లో ప్రారంభం కాగా, 2019 నుంచి దీనికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ‘సే హలో టు ప్రైవసీ’ ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్.. వాట్సాప్‌లానే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సర్వీస్ ఇస్తుండటంతో యూజర్లు ఈ యాప్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మెసేజింగ్ యాప్.. ఐఫోన్, ఐపాడ్, ఆండ్రాయిడ్, విండోస్, మాక్, లైనక్స్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు అందుబాటులో ఉంది. నాన్ ప్రాఫిట్ కంపెనీ అయిన ‘సిగ్నల్ ఫౌండేషన్ అండ్ సిగ్నల్ మెసెంజర్ ఎల్‌ఎల్‌సీ’ దీని అభివృద్ధి చేయగా, అమెరికన్ క్రిప్టోగ్రాఫర్, సిగ్నల్ మెసెంజర్ సీఈవో మోక్సీ మార్లిన్ స్పైక్ దీన్ని రూపొందించాడు. 2017లో వాట్సాప్‌ను వీడిన ఆ సంస్థ కో-ఫౌండర్ బ్రయాన్ ఆక్టన్, సిగ్నల్‌లో 50 మిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాడు. ఉచితంగా సర్వీస్ అందించే సిగ్నల్ నుంచి.. వాట్సాప్‌లానే చాటింగ్ చేసుకోవడంతో పాటు ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. 150 మందితో గ్రూప్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశముంది. అయితే గ్రూప్‌లో ఒకరి ప్రమేయం లేకుండా జాయిన్ అయ్యే అవకాశం లేదు. గ్రూప్‌లో జాయిన్ అయ్యేందుకు ఓ ఇన్విటేషన్ యూజర్‌కు వెళ్తుంది, అతడు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే గ్రూపులో మెంబర్ అవుతాడు. ఇందులో డిజప్పియరింగ్ మెసేజ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. కానీ చాట్ బ్యాకప్ ఆప్షన్ లేదు. మొబైల్ కోల్పోయారంటే.. ఇక అంతే సంగతులు. మళ్లీ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే.

Tags:    

Similar News