డీసీఎంలో భారీగా గంజాయి..

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్‌ పోస్ట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు రోజుమాదిరిగానే తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు దానిని ఆపారు. అనంతరం చెక్ చేయగా అందులో 100కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 4సంచుల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్‌ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న […]

Update: 2020-08-15 10:59 GMT
డీసీఎంలో భారీగా గంజాయి..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్‌ పోస్ట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు రోజుమాదిరిగానే తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు దానిని ఆపారు. అనంతరం చెక్ చేయగా అందులో 100కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 4సంచుల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్‌ చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆ గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చి, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News