'పోలీసులు వెళ్లనీయడం లేదు.. మేమెలా బ్రతకాలి'

దిశ, కామారెడ్డి: “ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఆర్దర్లు తీసుకుని పని చేసుకోలేకపోతున్నాం. పెళ్లి షూట్ చేయడానికి కెమెరాలు తీసుకుని వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపు సమయంలో పెళ్లిళ్లు కాకపోవడంతో ఇతర సమయాల్లో వెళ్లాల్సి వస్తుంది. దాంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా అయితే ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్న మేము ఎల్ బ్రతకాలి” అని ఫోటో, వీడియో గ్రాఫర్లు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫోటో స్టూడియోలో ఫోటో గ్రాఫర్లు విలేకరుల […]

Update: 2021-05-25 01:47 GMT

దిశ, కామారెడ్డి: “ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఆర్దర్లు తీసుకుని పని చేసుకోలేకపోతున్నాం. పెళ్లి షూట్ చేయడానికి కెమెరాలు తీసుకుని వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపు సమయంలో పెళ్లిళ్లు కాకపోవడంతో ఇతర సమయాల్లో వెళ్లాల్సి వస్తుంది. దాంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా అయితే ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్న మేము ఎల్ బ్రతకాలి” అని ఫోటో, వీడియో గ్రాఫర్లు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫోటో స్టూడియోలో ఫోటో గ్రాఫర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో ఫోటో, వీడియో గ్రాఫర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లాక్ డౌన్ ఉండటంతో పెళ్లిళ్లకు 40 మందికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, ఆ 40 మందితో పాటు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు బ్యాగులు, కెమెరాలు వెంట ఉన్నా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని, వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల పైనే ఆధారపడి ఉన్న ఫోటో, వీడియో గ్రాఫర్లు ఉన్నారని, ఇలాగే కొనసాగితే తాము ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు.

ఇదే విధానం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కెమెరా డౌన్ చేస్తామని హెచ్చరించారు. అదే జరిగితే రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్టుగానే తమకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫోటో గ్రాఫర్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సురేష్, కోశాధికారి గోపాల్ రెడ్డి, కామారెడ్డి మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, కార్యదర్శి సంతోష్, కోశాధికారి ఆంజనేయులు, సీనియర్ ఫోటో గ్రాఫర్స్ సాయిప్రభు, నవీన్, బిబిపేట అధ్యక్షుడు తిరుపతి, నరహరి, శ్రీను, రాజంపేట మండల ఇంచార్జి వడ్ల శ్యామ్ సుందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News