Today Weather update : తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్న కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్(Yellow Alert) సైతం జారీ చేశారు. బుధవారం నాడు ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్. సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.