తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
రానున్న మూడురోజులపాటు తెలంగాణ(Telangana)లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
దిశ, వెబ్ డెస్క్ : రానున్న మూడురోజులపాటు తెలంగాణ(Telangana)లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. సౌత్ ఏపీ తీరంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సాగతి సముద్రం నుండి 6 కిమీల ఎత్తు వరకు చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతం అయింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు గాలులుతోపాటు.. ఉమ్మడి ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచి పోయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.