Andhra Pradesh Weather update: ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు

దేశవ్యాప్తంగా తిరోగమనంలో నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2024-10-13 14:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తిరోగమనంలో నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం నుంచి క్రమంగా నైరుతి రుతుపవనాలు వైదొలగుతున్నాయని, మరో రెండ్రోజుల్లో మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. దక్షిణ భారతదేశం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రేపటికల్లా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింతగా బలపడే సూచనలున్నాయంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరం వైపు అల్పపీడనం కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

For more Details : Today Weather Update: నేటి వాతావరణం రిపోర్ట్ ఇదే

Tags:    

Similar News