Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ.. దూసుకొస్తున్న మూడు తుఫాన్లు!!

ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-10-07 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. తరచూ వాతావరణం కూల్‌గా ఉంటూ సాయంత్రం లేదా రాత్రిళ్లు వర్షం పడుతోంది. అయితే తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని  వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, మేడ్చల్, కామారెడ్డి,వికారాబాద్, మెదక్ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని వెల్లడించింది. అలాగే తెలుగు రాష్ట్రాలకు తుఫాను వచ్చే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో రెండు, అరేబియా సముద్రంలో ఒక తుఫాను వచ్చే చాన్స్ ఉందని వచ్చే మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం చూపనుందని అంటున్నారు. కాగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు.. కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 


Similar News