ప్రతిరోజు గంట అదనంగా పనిచేస్తాం : ఉద్యోగుల ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో ఉద్యోగులకు 30శాతం పిట్ మెంట్, పీఆర్సీ జీవోల విడుదలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులంటే సీఎంకు అభిమానం అని, 30శాతం ఫిట్ మెంట్, పీఆర్సీ జీవోల విడుదల అందుకు నిదర్శనమన్నారు. ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ […]

Update: 2021-06-09 10:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో ఉద్యోగులకు 30శాతం పిట్ మెంట్, పీఆర్సీ జీవోల విడుదలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులంటే సీఎంకు అభిమానం అని, 30శాతం ఫిట్ మెంట్, పీఆర్సీ జీవోల విడుదల అందుకు నిదర్శనమన్నారు. ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి. మమత, ప్రధానకార్యదర్శి ఎ. సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సంఘం తరుపున పీఆర్సీ జీవోల విడుదలకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి వర్గ సభ్యుడు, మంత్రిశ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములమై ప్రతి రోజు గంట అదనంగా పనిచేస్తామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగుల ప్రతి సమస్యలను సానుకూల దృక్పథంతో సీఎం స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం నాయకులు ఎస్.సహదేవ్, రవీందర్ రావు, నగరశాఖ అధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, సుజాత, అరుణ్ కుమార్, బి. వెంకటయ్య, ప్రణయ్ కుమార్, సబిత, మోహన్‌సింగ్ , యాదగిరి, నగర కార్యదర్శి టి. లక్ష్మణ్‌గౌడ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, లావణ్య, శివకుమార్, సురభి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News