ఆర్టీసీ అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో పనిచేసే కార్మికులను అధికారులు వేధిస్తున్నారని టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బస్‌భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో యూనియన్ లకు ప్రభుత్వం అనుమతి కల్పించడం సంతోషకరమన్నారు. రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభం కావడం ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక నుంచి యూనియన్ లలో గ్రూపులు, తగాదాలు ఉండవన్నారు. ప్రతీ ఒక్కరం 49 వేల ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. టీఎంయూతో […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో పనిచేసే కార్మికులను అధికారులు వేధిస్తున్నారని టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బస్‌భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో యూనియన్ లకు ప్రభుత్వం అనుమతి కల్పించడం సంతోషకరమన్నారు. రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభం కావడం ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక నుంచి యూనియన్ లలో గ్రూపులు, తగాదాలు ఉండవన్నారు.
ప్రతీ ఒక్కరం 49 వేల ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. టీఎంయూతో ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. అయితే పెరిగిన అవసరాల నిమిత్తం కొత్త బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. లేకుండా ప్రగతి శున్యమవుతుందన్నారు. దీంతో పాటు కార్మికులు మెరుగ్గా పనిచేసేందుకు పీఆర్ సీ ప్రకటించాలన్నారు. టీఎంయూ ఎంఎల్ సీ కవిత సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.