‘దుర్వినియోగమైతే దర్యాప్తు చేస్తాం’
న్యూఢిల్లీ: తాము అభివృద్ధి చేసిన పెగాసెస్ దుర్వినియోగమవుతున్నట్టు ఒక విశ్వసనీయ ఆధారం లభించినా వెంటనే దర్యాప్తు చేస్తామని ఎన్ఎస్‌వో స్పష్టం చేసింది. ఇదే తమ విధానమని, అవసరమైతే సిస్టమ్ మొత్తంగా షట్‌డౌన్ చేస్తామని వివరించింది. పెగాసెస్ స్పైవేర్‌తో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, అధికారులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వేస్తున్నారని మీడియాలో కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ ఎన్ఎస్‌వో కొట్టేస్తూ వచ్చింది. ఇక మీడియా కథనాలపై స్పందించబోమని తెలిపింది. ఇవన్నీ ఫ్రెంచ్ సంస్థ ఫర్బిడెన్ స్టోరీస్ సారథ్యంలో […]
న్యూఢిల్లీ: తాము అభివృద్ధి చేసిన పెగాసెస్ దుర్వినియోగమవుతున్నట్టు ఒక విశ్వసనీయ ఆధారం లభించినా వెంటనే దర్యాప్తు చేస్తామని ఎన్ఎస్‌వో స్పష్టం చేసింది. ఇదే తమ విధానమని, అవసరమైతే సిస్టమ్ మొత్తంగా షట్‌డౌన్ చేస్తామని వివరించింది. పెగాసెస్ స్పైవేర్‌తో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, అధికారులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వేస్తున్నారని మీడియాలో కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ ఎన్ఎస్‌వో కొట్టేస్తూ వచ్చింది. ఇక మీడియా కథనాలపై స్పందించబోమని తెలిపింది. ఇవన్నీ ఫ్రెంచ్ సంస్థ ఫర్బిడెన్ స్టోరీస్ సారథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న మీడియా క్యాంపెయిన్ అని పేర్కొంది. కొంతమంది ప్రయోజనాలకు అనుకూలంగా జరుగుతున్న తతంగమని తెలిపింది.