రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడుతాం

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై కేంద్ర జల్‌శక్తి ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా నోటిఫికేషన్ ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్లటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే […]

Update: 2021-07-17 09:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై కేంద్ర జల్‌శక్తి ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా నోటిఫికేషన్ ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్లటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న అంశాలకు సంబంధించిన లోటుపాట్లు, వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. జలవివాదాల విషయంలో సీఎం జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతవరకైనా పోరాడుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.

Tags:    

Similar News