హుజురాబాద్‌లో పోటీపై కోదండరామ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. కోదండరామ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్ పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతామని తెలిపారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. కోదండరామ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్ పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతామని తెలిపారు.
టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ అమరువీరుల ఆశయ సాధనకు టీజేఎస్ కృషి చేస్తోందన్నారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని కోదండరామ్ ప్రశ్నించారు. నిరుద్యోగం, పోడు భూములు, ప్రజా సమస్యలపై పోరాడతామని కోదండరాం తెలిపారు.