అయ్యో మేము తిట్టలే.. మంత్రి పేర్ని నాని

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనం బాధల్లో ఉంటే.. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో శుక్రవారం పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుది పరామర్శ యాత్రా?.. రాజకీయ యాత్రా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విమర్శలు చాలా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారంలో లేకపోవడంతో ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారన్నారు. వరద బాధితులను ఓదార్చకుండా రాజకీయ విమర్శలు ఏంటని […]

Update: 2021-11-26 03:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనం బాధల్లో ఉంటే.. చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో శుక్రవారం పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుది పరామర్శ యాత్రా?.. రాజకీయ యాత్రా? అని ప్రశ్నించారు. చంద్రబాబు విమర్శలు చాలా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారంలో లేకపోవడంతో ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారన్నారు. వరద బాధితులను ఓదార్చకుండా రాజకీయ విమర్శలు ఏంటని నిలదీశారు.

వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఎక్కడ తిరిగారు?. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఊరూరా ఈదుకుంటూ వెళ్లారా?. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలి. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి నా భార్యను తిట్టారు..నా భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. మంత్రులు గానీ.. వైసీపీ ఎమ్మెల్యేలుగానీ ఎవరూ చంద్రబాబు భార్యను తిట్టలేదని మంత్రి నాని క్లారిటీ ఇచ్చారు. మీ ఆడవాళ్లను తిట్టాల్సిన కర్మ మాకేంటి? అని ప్రశ్నించారు.

‘మాకు సంస్కారం ఉంది. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. భార్య, తల్లి, చెల్లి, కూతుర్లు ఉన్నారు. మాకు ఆడవాళ్లంటే అపారమైన గౌరవం ఉంది. తిట్టాల్సి వస్తే నిన్నే తిడతాం కానీ మీ ఇంట్లోని ఆడవాళ్లను తిట్టం. అంతేగానీ చంద్రబాబులా బంధుత్వానికి విలువ ఇవ్వలేని వ్యక్తులం కాదు. మామ, తమ్ముడు అంటే చంద్రబాబుకు జాలి, దయ లేదు. బంధం ఉండదు. బంధుత్వం ఉండదు. ఎవరినైనా అవసరానికి వాడుకుని వదిలేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇప్పటికీ క్లారిటీ ఇస్తున్నాం నారా భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదు’ అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News