రాగి పాత్రలో నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

దిశ,వెబ్ డెస్క్: పూర్వం రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని మాత్రమే తాగేవారు. ఇక ఇప్పటికి కూడా కొంత మంది రాగి పాత్రల్లో నీళ్లు తాగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం దుకాణాల్లో అధిక ధరలు చెల్లించి కాపర్ బాటిల్స్ కొంటున్నారు. ఎందుకంటే కాపర్ పాత్రలో నిల్వ వుంచిన నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా రాగి పాత్రల్లో నీటిని నిల్వచేస్తే అందులోని సూక్ష్మ జీవులు నశించి శుద్ది అవుతుంది. తాజాగా పలు అధ్యయనాలు కూడా ఈ […]

Update: 2020-10-25 05:28 GMT

దిశ,వెబ్ డెస్క్:
పూర్వం రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని మాత్రమే తాగేవారు. ఇక ఇప్పటికి కూడా కొంత మంది రాగి పాత్రల్లో నీళ్లు తాగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం దుకాణాల్లో అధిక ధరలు చెల్లించి కాపర్ బాటిల్స్ కొంటున్నారు. ఎందుకంటే కాపర్ పాత్రలో నిల్వ వుంచిన నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా రాగి పాత్రల్లో నీటిని నిల్వచేస్తే అందులోని సూక్ష్మ జీవులు నశించి శుద్ది అవుతుంది. తాజాగా పలు అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధ్రువీకరించాయి ..

ఇప్పుడంటే మనం వాటర్ ప్యూరి ఫయర్స్ ఉపయోగిస్తున్నాం. కానీ పూర్వం అలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. అందుకే రాత్రంతా రాగి పాత్రల్లో నీటిని నిల్వ వుంచే వారు. మరుసటి రోజు ఆ నీటిని తాగేవారు. ఇలా చేస్తే శరీరంలోని కఫం, పిత్తం,వాతాలు సమతుల్యంగా ఉంటాయని పూర్వీకులు ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఇంకా ఈ నీటితో శరీరంలోని వివిధ అవయవాల పనితీరు చాలా వరకు మెరుగు పడుతుంది.

రాగి పాత్రల్లో నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ , కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. ఇక రాగి పాత్రల్లో ఆహారం తీసుకుంటే శరీరానికి పలు రకాల పోషకాలు అందుతాయి. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించడానికి ఈ నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాగి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొత్త కణాల ఉత్పత్తిలో రాగి ప్రముఖ పాత్ర వహిస్తుంది. కడుపులో ఎలాంటి పుండ్లు వున్న వాటిని మాన్పడంలో రాగి దోహదపడుతుంది. వృద్దాప్య ఛాయలు ధరి చేరకుండా రాగి ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలని అనుకునేవారు రాగి పాత్రలో నిల్వ వుంచిన నీటిని తాగితే చాలా ప్రయోజనం వుంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయి.

ఇక ఈ నీటిని తాగడం వల్ల ఇన్పెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. అంతే కాకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ఈ నీరు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు రాకుండా రాగి కాపాడుతుంది. చర్మ వ్యాధులను దూరం చేయడంలో కాపర్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా రక్త హీనతను తగ్గించేందుకు రాగి పాత్రలో నీరు చాలా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News