గొర్రెల కాపరిగా మారిన వార్డు సభ్యురాలు
దిశ, మల్హర్: పంటలు వేసినా పెట్టుబడి రాక తెచ్చిన అప్పులు తీర్చేందుకు వార్డు సభ్యురాలు గొర్రెల కాపరిగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారం గ్రామానికి చెందిన ఉప్పుల రజిత రాజు అనే మహిళ స్థానిక పంచాయతీ 6వ వార్డు సభ్యురాలుగా కొనసాగుతుంది. సొంత భూమిలో మిర్చి, వరి పంటలు వేసినా దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు భారం అవుతున్నాయని విధిలేని పరిస్థితిలో సొంత గొర్లకే ఆమె కాపరిగా మారింది. వేరే కాపరిని పెట్టలేక, […]
దిశ, మల్హర్: పంటలు వేసినా పెట్టుబడి రాక తెచ్చిన అప్పులు తీర్చేందుకు వార్డు సభ్యురాలు గొర్రెల కాపరిగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారం గ్రామానికి చెందిన ఉప్పుల రజిత రాజు అనే మహిళ స్థానిక పంచాయతీ 6వ వార్డు సభ్యురాలుగా కొనసాగుతుంది. సొంత భూమిలో మిర్చి, వరి పంటలు వేసినా దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు భారం అవుతున్నాయని విధిలేని పరిస్థితిలో సొంత గొర్లకే ఆమె కాపరిగా మారింది. వేరే కాపరిని పెట్టలేక, వారికి జీతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని.. 2 ఎకరాల్లో మిర్చి తోట వేస్తే నష్టపోయామని, వరి వేస్తే వర్షం కారణంగా పూర్తిగా నేలమట్టమై ధాన్యం దిగుబడి రాక అప్పులపాలయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భార్యాభర్తలిద్దరూ గొర్రెల కాపరిగా మారామని, ప్రభుత్వం ఉపాధి చూపించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది.