ఆరోగ్యానికి 12 నిముషాల నడక చాలు
దిశ, వెబ్ డెస్క్: నడకతో చాలా రకాల ఉపయోగా లున్నాయని మనందరకీ తెలుసు. నడవడం వల్ల..గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి రోగాలు దరిచేరవు. స్థూలకాయం, కొవ్వును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుతుంది. వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా.. చాలా మంది నడకను నెగ్లెక్ట్ చేస్తుంటారు. మరి కొందరు వాకింగ్ చేయడానికి టైమ్ దొరకడం లేదని చెబుతుంటారు. వారికే కాదు, ఎవరికైనా 12 నిముషాల పాటు నడక సాగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయని […]
దిశ, వెబ్ డెస్క్: నడకతో చాలా రకాల ఉపయోగా లున్నాయని మనందరకీ తెలుసు. నడవడం వల్ల..గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి రోగాలు దరిచేరవు. స్థూలకాయం, కొవ్వును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుతుంది. వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా.. చాలా మంది నడకను నెగ్లెక్ట్ చేస్తుంటారు. మరి కొందరు వాకింగ్ చేయడానికి టైమ్ దొరకడం లేదని చెబుతుంటారు. వారికే కాదు, ఎవరికైనా 12 నిముషాల పాటు నడక సాగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయని ఓ పరిశోధనలో తేలింది.
నడక దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. అధిక బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ వంటివి రాకుండా తోడ్పడుతుంది. కీళ్లు బలపడటమే కాకుండా.. రక్తప్రసరణ వేగవంతమవుతుంది. ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా.. ఆందోళనలో, లేదా డిప్రెషన్ లో ఉన్నా.. కాసేపు నడక సాగిస్తే బ్యాడ్ మూడ్ నుంచి త్వరగా బయట పడవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. ఇందుకోసం మైళ్లకు మైళ్లు నడవాల్సిన పనిలేదు. లోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. నిత్యం కనీసం 12 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే చాలు. మన మూడ్ ఇట్టే మారిపోతుందట. అలా వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని, ఇతర మానసిక సమస్యలు పోయి, సంతోషంగా ఉంటారని పరిశోధనల్లో తేలింది. ఒత్తిడి నుంచి బయట పడాలంటే వాకింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని వారు చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. కనుక వాకింగ్ చేసేందుకు టైం లేదని అనేవారు.. కనీసం 12 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేసేందుకు ట్రై చేయండి. సాధారణంగా ఓ వ్యక్తి తన రోజు వారిలో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు మాత్రమే నడవగలడని అధ్యయనాలు చెబుతున్నాయి. అరోగ్యంగా ఉండటానికి ఒక్క వ్యక్తికి అంతే నడక సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
tags: walk, research, depression, mood change, boost your mood