కబ్జా కోరల్లో కోట్ల రూపాయాల వక్ఫ్ భూములు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా దందా కొనసాగుతోందనీ, వందల కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారని మజ్లీస్ బచావో తహరిక్ (ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు అంజదుల్లా ఖాన్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారనీ.. కానీ ఇప్పటి వరకు కమిషనరేట్ నియమించలేదని ఆయన అన్నారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా దందా కొనసాగుతోందనీ, వందల కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారని మజ్లీస్ బచావో తహరిక్ (ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు అంజదుల్లా ఖాన్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారనీ.. కానీ ఇప్పటి వరకు కమిషనరేట్ నియమించలేదని ఆయన అన్నారు. నిజామాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న వక్ప్ భూముల్లో ఇటీవలే షాపింగ్ మాల్, మల్టీ కాంప్లెక్స్, స్టార్ హోటల్ నిర్మాణం జరిగినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. కోట్ల రూపాయాల విలువైన మొత్తం 4,302 గజాల భూమి కండ్ల ముందే కబ్జాకు గురవుతున్నా నిజామాబాద్ కు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు పట్టించుకోవడం లేదన్నారు.