ఇస్లాంపూర్ వీఆర్ఏ ఆత్మహత్య
దిశ, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇస్లాంపూర్‌లో వీఆర్ఎగా పనిచేస్తున్న నీరుడి ప్రసాద్(33) రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లో బంగారం, నగలు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులతో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఆదివారం రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు […]
దిశ, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇస్లాంపూర్‌లో వీఆర్ఎగా పనిచేస్తున్న నీరుడి ప్రసాద్(33) రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లో బంగారం, నగలు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులతో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఆదివారం రామప్పగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags : VRA, suicide, family quarrels, medak, gold